News

అసదుద్దీన్ లేవగానే భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన ‌లోక్‌సభ

859views

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకార సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమాణం చేసేందుకు ఒవైసీ పేరు పిలవగానే సభలోని బీజేపీ ఎంపీలు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన  ఇంకా చేయండంటూ సంజ్ఞలతో వారిని ఉత్సాహపరిచారు. ప్రమాణం అనంతరం సంతకం చేయడం మరిచిపోయిన అసద్‌కు లోక్‌సభ సిబ్బంది గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ‘అసదుద్దీద్ అను నేను పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల, శాసన వ్యవస్థ పట్ల పూర్తి విశ్వాసం, నిబద్ధతతో నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రమాణం చేసిన అసద్ జైభీమ్, తక్‌బీర్, అల్లాహో అక్బర్, జైహింద్ నినాదాలతో ముగించారు.