News

పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది కాల్చివేత

581views

త ఫిబ్రవరి 14 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూల్వామా దాడిలో 40 సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం అయ్యారు.పుల్వామా ఆత్మాహుతి దాడికి ఐఈడీ బాంబులతో కూడిన వెహికిల్‌ను సమకూర్చిన జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది సాజద్ అహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

కాగా రెండు రోజుల నుండి అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు , భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.ఈ ఎదురు కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు మృతి చెందగా, వారిలో పుల్వామా దాడికి కారును సమకూర్చిన ఉగ్రవాది సాజద్ ఆహ్మద్ అతనికి సహకరించిన తౌసిఫ్‌లు కూడ ఉన్నారు, మరోవైపు ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన సైనికుడు ఒకరు మృత్యువాత పడ్డారు.

కాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీర్‌పీఎఫ్‌తోపాటు జమ్ముకాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కోనసాగుతోంది. ఈనేపథ్యంలోనే సోమవారం నుండి ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతనాగ్ జిల్లాలో వాగ్‌ హోం ప్రాంతంలో ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే  పోలీసులపై ఉగ్రవాద ముఠా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సోమవారం ఓ ఆర్మీమేజర్ సైతం మృత్యువాత పడ్డారు.