
327views
తిరుమల అన్నప్రసాద సముదాయంలో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ‘మాకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నిన్న కొంతమంది భక్తులు అన్నప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆందోళన చెయ్యడం మా దృష్టికి వచ్చింది. నిజంగా నాణ్యత లేదంటే వాటిని సరిదిద్దుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ఇతర భక్తులను కూడా వారు రెచ్చగోట్టేలా వ్యవహరించడం సముచితం కాదు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టని దెబ్బతీసేలా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం’ అని కరుణాకర్ రెడ్డి అన్నారు.





