
406views
అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామమందిరానికి సంబంధించిన అక్షింతలను సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని మందసలో ఊరేగించారు. జనవరి 22న ఆలయ ప్రతిష్ట జరుగుతోంది. దీనిలో భాగంగా అయోధ్య నుంచి శ్రీరాముని దివ్య అక్షింతలు శ్రీకాకుళం కేంద్రానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి మందసకు చేరుకున్న వీటిని స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా జగన్నాథస్వామి ఆలయం తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పంచాయతీలకు, గ్రామాలకు, భక్తులు ఇళ్లకు పంపించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు బెస్త కామేశ్వరరావు, ఇప్పిలి కేశవరావు(చిట్టి), రౌతు చిరంజీవరావు, కొంచాడ సురేష్‌కుమార్, కొమ్మాజోస్యుల సీతారామశర్మ, జగదీశ్‌పండా, దేవరశెట్టి కామేశ్వరరావు, శ్రీసత్యసాయి సేవాసమితి ప్రతినిధులు వూనా ఈశ్వరరావు, వడ్డి అప్పారావు పాల్గొన్నారు.





