
393views
నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో సంవత్సరంలో మూడు నాలుగు సార్లు ఇలా దుస్తులు పంపిణి చేయటం జరుగుతోంది.

ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర మఠం తదితర చెంచుగుడాలలో గిరిజనులకు దుప్పట్లు, చీరలు మరియు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు కే నాగ సుబ్బారెడ్డి, కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, కమిటీ సభ్యులుశ్రీ వి రమణయ్య గౌడ్, గోకవరం ఆవాస ప్రముఖ్ రామకృష్ణ,జానాల బిచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.





