News

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి

251views

భారత దేశానికి నౌకాదళ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని ప్రధాని కొనియాడారు. సోమవారం మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో నేవీ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటూ ముందుగా భారత నౌకాదళ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.రాజ్‌కోర్ట్ కోటలో శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రతి భారతీయుడిలోనూ ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ సింధుదుర్గ్‌ కోట నుండి నేవీ డే శుభాకాంక్షలు తెలియజేయడం నా అదృష్టం. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి సముద్రపు శక్తి, ప్రాముఖ్యత తెలుసు అని ప్రధాని పేర్కొన్నారు. నావికాదళంలో ర్యాంకుల పేర్లను భారతీయ సంస్కృతికి అనుగుణంగా మారుస్తామని ప్రధాని ప్రకటించారు.

భారతదేశం తన మహాసముద్రాల సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ రోజు భారతదేశం అద్భుతమైన లక్ష్యాలను నిర్దేశిస్తోందని, దేశానికి అద్భుతమైన విజయాల చరిత్ర ఉందని తెలిపారు.