
ఖలిస్థాన్ ఉగ్రవాది, ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నాయ కుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. కుట్రకు సంబంధించిన అన్ని అంశాలపై విచారించేం దుకు ఈ నెల 18న ఆ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
“పన్ను హత్య కుట్రకు సంబంధించి అమెరికా నుంచి కొంత సమాచారం అందింది. వ్యవస్థీకృత నేరగాళ్లు, తుపాకుల అక్రమ వ్యాపారులు, ఉగ్రవాదుల మధ్య సంబంధాలపై అందులో ఉన్నాయి. అవి మన జాతీయ భద్రత ప్రయోజనాలను ప్రభావితం చేసేలా కూడా ఉన్నందున ఆ సమాచారాన్ని మనదేశం తీవ్రంగా పరిగ ణిస్తోంది. సంబంధిత విభాగాలు ఆ అంశాన్ని పరిశీలి స్తున్నాయి. దర్యాప్తు కమిటీ తేల్చిన అంశాల ఆధారంగా మన దేశం చర్యలు తీసుకుంటుంది” అని బాగ్చి వెల్లడిం చారు. అమెరికా, కెనడా పౌరుడైన గురుపత్వంత్సింగ్ హత్యకు పన్నిన ఓ కుట్రను ఛేదించినట్లు ఇటీవల అమె రికా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఆ దేశం మన దేశాన్ని కోరింది.





