News

డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో విశేష ఉత్స‌వాలు

223views

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాలను తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. డిసెంబ‌రు 3న పార్వేటి మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం,డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి, డిసెంబ‌రు 12న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభంతో పాటు డిసెంబ‌రు 17న ధ‌నుర్మాసం ప్రారంభం కానున్నట్లు చెప్పారు.డిసెంబ‌రు 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌, డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభమవుతుమదని..అలాగే స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం నిర్లహించనున్నట్లు టిటిడి తెలిపింది. డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాద‌శి నాడు శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం..శ్రీ స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటితో పాటు డిసెంబ‌రు 28న శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ణ‌యక‌ల‌హ మ‌హోత్స‌వాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి తెలిపింది.