
186views
భారత నౌకాదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్‌ఆర్‌జీఎం), ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌ఈఎల్ సంస్థ రూ.2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిని నేవీలోని యుద్ధనౌకలకు అమరుస్తారు. ఎస్‌ఆర్‌జీఎం అనేది మధ్యశ్రేణి ఆయుధ వ్యవస్థ. ఇది శత్రు క్షిపణులు, విమానాలను నేలకూల్చగలదు. అత్యంత కచ్చితత్వంతో, శరవేగంగా తూటాలను పేల్చగలదు. హరిద్వార్‌లో బీహెచ్‌ఈఎల్‌కు చెందిన కర్మాగారంలో ఈ ఆయుధాలను తయారుచేస్తారు.





