
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. సదస్సులో పలు తీర్మానాలు చేయబడతాయని, ప్రణాళికాబద్దంగా
వాటిని వచ్చే సదస్సు కల్లా సాకారం చేసుకోవాలని తెలిపారు.
ఒకొక్క మెట్టును అధిగమిస్తూ. విశ్రమించకుండా. మన సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతూ పోవాలని ఆకాంక్షించారు. అందరికి చేరువైనపుడే. ధర్మ విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.
కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అజ్ఞానం, వికారాలే ప్రపంచానికి నిజమైన శతృవులని అన్నారు. భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక దిశగా పయనింపజేయడమే మన జాతీయ విధి అని వెల్లడించారు. సనాతన ధర్మం కోసమే భారత్ ప్రయాసపడుతోందని, ఈ దిశగా మనం కృతకృత్యులైతే దుర్మతులపై నిశ్చితంగా సముచిత విజయం సాధించినట్టే అని వివరించారు. తద్వారా అనేక మంది సంతోషాన్ని, సంక్షేమాన్ని సాధించినట్టేనని పేర్కొన్నారు





