
432views
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ కాలభైరవ హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, శ్రీ కాలభైరవ మూలవర్లకు కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, పూజ, జపం, హోమం, విశేష దీపారాధన నిర్వహించారు.
హోమ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు నవగ్రహ హోమం జరుగనుంది.





