
శీతాకాలం దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం ఉదయం 8.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పండితులు మహాద్వారాన్ని మూసివేశారు. ఎముకలు కొరికే చలిలో ఈ కార్యక్రమంలో 2500 మంది భక్తులు పాల్గొన్నారు. పంచముఖి డోలీలో కేదారేశ్వరుడిని ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లారు. దాదాపు 6 నెలల పాటు కేదార్‌నాథ్‌ని అక్కడ పూజిస్తారు. ఈ ఏడాది 19.5 లక్షల మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
ఛార్ ధామ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన యమునోత్రిని కూడా బుధవారం ఉదయం 11.30 గంటలకు మూసివేసి భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. యమునా దేవిని ఉత్తరకాశీలోని ఖర్సాలీలోని కుషిమఠానికి తీసుకెళ్లారు. మంగళవారం గంగోత్రిని మూసివేశారు. కేదార్ నాథ్ పరిసర ప్రాంతాల్లో మంచు కరిగిపోయి చలి గాలులు వీస్తున్నాయి. చివరికి బద్రీనాథ్ ఆలయాన్ని ఈ రోజు మూసివేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ ధామ్ ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 15 క్వింటాళ్ల బంతి పూలతో అందంగా అలంకరించారు. మరోవైపు శీతాకాలాన్ని పురష్కరించుకొని బద్రీనాథ్ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు.ఈ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.33 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు తెలిపింది. శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.





