News

జ్ఞానవాపి కేసు ; ఏఎస్‌ఐ విజ్ఞప్తిపై నేడు కోర్టు విచారణ

270views

జ్ఞానవాపి మసీదు ఆవరణలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో 15 రోజుల గడువు కావాలంటూ భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్‌ఐ) చేసిన విజ్ఞాపనపై వారణాసి జిల్లా కోర్టు శనివారం విచారణ జరపనుంది. శుక్రవారం జరగాల్సిన విచారణను శనివారం చేపట్టడానికి కోర్టు అంగీకరించిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అమిత్‌ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా జడ్జి ఎ.కె.విశ్వేశ్‌ శనివారం ఈ కేసు విచారణను చేపడతారు. సర్వేను నవంబరు రెండోతేదీ నాటికే పూర్తిచేశామని, కానీ సాంకేతిక అంశాలతో కూడిన నివేదికను ఇంకా రూపొందించాల్సి ఉందని ఏఎస్‌ఐ కోర్టుకు విన్నవించింది.