News

దీపావళి రోజు హిందువులపై ఖలిస్థాన్‌ మద్దతుదారుల దాడి

310views

ఖలిస్థాన్‌ జెండాలను చేతపట్టిన కొందరు వ్యక్తులు దీపావళి పండగను జరుపుకొంటున్న హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తిలోకి వచ్చాయి. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మాల్టన్‌లోని వెస్ట్‌వుడ్‌ మాల్‌లో హిందువులు దీపావళిని జరుపుకొంటున్నారు. గుంపుగా వచ్చిన ఖలిస్థాన్‌ మద్దతుదారులు వారిపైకి రాళ్లు, మరికొన్ని వస్తువులను విసురుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ గుంపును అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్న దృశ్యం కూడా అందులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పీల్‌ రీజనల్‌ పోలీసులు ఈమెయిల్‌ సందేశం ద్వారా వెల్లడించారు. కెనడాలో కొందరు వ్యక్తులు భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ తమకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, దీనిని కట్టడి చేయాలని భారత ప్రభుత్వం సూచించిన వారం రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరిగాయి.