
ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సల్మాన్ అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇస్లామిస్ట్ నిరంకుశుడు టిప్పు సుల్తాన్ ముందు వంగి, చేతులు జోడించి అభ్యర్దిస్తునట్లుగా ఉంది. ఈ పోస్ట్ పై హిందూ సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హిందూ సమాజానికి, మహారాష్ట్ర సమాజానికి గర్వకారణమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇస్లాం మతస్థుడు టిప్పు సుల్తాన్ ముందు నమస్కరిస్తున్నట్లు వీడియోలో చూపించారు. టిప్పు సుల్తాన్‌ను ప్రశంసిస్తూ ‘భారత్ కి షాన్’ అని క్యాప్షన్ పెట్టారు.
ఎఫ్ఐఆర్ కాపీ

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఈ పోస్ట్‌ను పెట్టినట్లు తెలిసింది. హిందూవుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సల్మాన్ పోస్ట్ ఉందని సాంగ్లీలోని జాత్ పోలీసులకు ప్రసాద్ సలుంఖే ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సల్మాన్ పై కేసు నమోదు చేశారు. నిందితుని పై IPCలోని సెక్షన్‌లు 153-A (ఉద్దేశపూర్వకంగా మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295-A (ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
Source : Opindia.com





