
249views
కాణిపాక ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. ఉదయం నుంచి ఆరవ కాలపూజ, అవభృథ హవనం, వ్రత సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, యాత్రదానం, కలశోద్వాసన, మూల విరాట్‌కు అభిషేకం, చండీయాగం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో తదితరులు పాల్గొన్నారు.





