
2030 నాటికి జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక జాబితాలో భారత్ గణనీయంగా దూసుకెళ్తోందని తెలిపింది. S&P విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశ GDP రెట్టింపు అవుతుందని, 2022లో $3.5 ట్రిలియన్లకు చేరుకోగా.. ఈ దశాబ్దం చివరినాటికి $7.3 ట్రిలియన్లకు చేరుకోనుందని తెలిపింది.
“ఈ వేగవంతమైన ఆర్థిక విస్తరణ ఫలితంగా 2030 నాటికి భారత జిడిపి పరిమాణం.. జపాన్ జిడిపిని మించిపోనుంది. ఫలితంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది” అని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం.. భారత్ లో అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తూ, గడిచిన 10 సంవత్సరాలలో విదేశీ డైరెక్ట్ పెట్టుబడుల ప్రవాహాలు గణనీయంగా పెరగడంతో భారతదేశ ఆర్థిక వృద్ధికి కారణమని పేర్కొంది.




