News

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై శ్రీవారు

266views

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. రాత్రి 7 గంటలకు శ్రీవారికి ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహించనున్నారు.