News

చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

266views

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేష వాహనంపై స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. నాలుగుమాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈరోజు సాయంత్రం హంస వాహన సేవ రాత్రి 7 గంటలకు జరుగనుంది.