News

ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు చోటు.. ఐవోసీ ఆమోదం

234views

ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్‌ కూడా ఒకటి. అయితే ఇలాంటి గేమ్‌కు ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో చోటు దక్కలేదు. తాజాగా ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను చేరుస్తూ ఐవోసీ కీలక నిర్ణయం తీసుకుంది.చాలా ఏళ్లుగా మెగా ఈవెంట్‌లోనూ ఈ క్రీడను చేర్చాలనే డిమాండ్ల నేపథ్యంలో ఐవోసీ కమిటీ (IOC) తాజాగా దీనికి ఆమోద ముద్ర వేసింది.ఎట్టకేలకు క్రికెట్‌ను (Cricket) ఒలింపిక్స్‌లో చూసే అవకాశం దక్కింది. అయితే, వచ్చే ఏడాది (పారిస్‌) ఒలింపిక్స్‌లో కాకుండా.. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో (Olympics) క్రికెట్‌ను కూడా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరల్డ్ కప్‌, ఆసియా కప్, ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను వీక్షించే అభిమానులకు ఒలింపిక్స్‌ రూపంలో మరో మెగా సంబరం ఆస్వాదించే అవకాశం కలిగినట్టే. అయితే టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తోపాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా చోటు కల్పించారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్‌ చేసింది.