News

చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త..ఇండియన్ ఓషియన్ రిమ్ దేశాలకు జైశంకర్ హెచ్చరిక

365views

హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని భారత్ పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు, భరించలేని రుణాలతో ‘హిడెన్ ఎజెండా’ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. చైనా రుణ ఉచ్చు గురించి పరోక్షంగా సభ్యదేశాలకు తెలియజేశారు.