
కమల్ హాసన్ ఎప్పుడైతే స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దాన్ని దేశ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. పలు ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కమల్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయనకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని అరవకురుచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ మాట్లాడుతూ, స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అవరకురుచ్చిలోని ఓ పీఎస్ లో కమల్ పై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ ల కింద మత భావాలను కించారంటూ కేసు నమోదు చేశారు.
కమల్ హాసన్‌పై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు తాను చేయడం లేదనీ… వాస్తవాన్ని చెబుతున్నాననీ కమల్ హాసన్ అన్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అరవకురిచి పోలీస్ స్టేషన్‌లో కమల్ హాసన్‌పై ఐపీసీలోని సెక్షన్లు 153A, 295A కింద కేసు నమోదు చేశారు. మతం, కులం, భాష, జాతి పేరుతో హింసను ప్రేరేపిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమల్ హాసన్‌కి వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. కమల్ హాసన్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్… ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు.





