
240views
ద్వారకా తిరుమల చిన వెంకటేశ్వరస్వామి వారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 25న ధ్వజారోహణ, 26న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, ధ్వజారోహణం, 29న వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.





