News

రేపు తిరుమలలో పున్నమి గరుడ సేవ

329views

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. గరుడ వాహన సేవ లో భాగంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ రోజు భాద్రపదమాస పౌర్ణమి కావడంతో శ్రీవారికి గరుడసేవ వైభవంగా జరుగనుంది. శ్రీవారి వాహనసేవల్లో కెల్లా ముఖ్యమైందిగా గరుడ సేవను పేర్కొంటారు. ఇందులో భాగంగా రేపు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ సేవ జరగనుంది.