News

కెనడా లో ఖలిస్థాన్‌ మద్దతుదారుల దుశ్చర్య

263views

భారత్‌కు వ్యతిరేకంగా కెనడా లో ఖలిస్థాన్‌ మద్దతుదారుల చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు నిరసనగా కెనడాలోని భారత్‌ దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. భారత జాతీయ జెండాను అవమానించారు. ప్రదాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టొరంటోలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 100 మంది ఖలిస్థాన్‌ మద్దతుదారులు పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. మరోవైపు వాంకోవర్‌, ఒట్టవాలో కూడా నిరసనలు కొనసాగాయి.