
1.1kviews
జమ్ముకశ్మీర్ రాష్ట్రం, పుల్వామాలోని డాలిపోరా ప్రాంతంలో భద్రతా దళాలు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఆయుధాలతో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి చెందగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. పారిపోయిన ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.





