News

స్థానికేతరులకు ఫ్లాట్లు ఇస్తే జమ్మూ రణరంగమే…. ఉగ్రవాదుల హెచ్చరిక

220views

జమ్మూ-కశ్మీర్‌లో స్థానికేతరులకు ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉగ్రవాదులు బెదిరింపులకు తెగబడ్డారు. జమ్మూ, ఢిల్లీల్లో దాడులు చేస్తామని వారు బెదిరించారు. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద స్థానికేతరులకు ఫ్లాట్లు కేటాయించనున్నట్లు జమ్మూ-కశ్మీర్‌ హౌసింగ్‌ బోర్డు ఏప్రిల్‌ 29న ప్రకటించింది. దాంతో అక్రమంగా స్థిరపడిన వారిని తరిమికొట్టడానికి ఏ అవకాశాన్ని వదలబోమంటూ ఇటీవల పూంచ్‌ ఉగ్రదాడితో ఐదుగురు జవాన్లను పొట్టన బెట్టుకున్న నిషేధిత ‘పీపుల్స్‌ యాంటీ ఫ్యాసిస్ట్‌ ఫ్రంట్‌’ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది.