
బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ఇందిరానగర్ నుంచి ఏప్రిల్ 21 రాత్రి ఓ రాపిడోను బుక్ చేసింది. 11.15ను ఆమెను పికప్ చేసుకున్న డ్రైవర్ మొదటి నుంచి వింత ప్రవర్తనతో ఆ మహిళను ఆందోళనకు గురిచేశారు. బైకర్ OTPచెక్ చేసే సాకుతో ఆమె ఫోన్ తీసుకున్నాడు.. అనంతరం వెళ్లాల్సిన రూట్లో వెళ్లకుండా విమానాశ్రయం వైపు బైక్‌ను నడిపిస్తూ ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆమె బైక్‌పై నుంచి జంప్ చేసింది. స్వల్పగాయాలతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
స్థానిక డీసీపీ మాట్లాడుతూ ‘‘మా డివిజన్‌లో ఇదే మొదటి కేసు. మహిళలు, పౌరుల భద్రత గురించి చర్చించడానికి క్యాబ్ యాజమానులు, బైక్ ట్యాక్సి నిర్వాహకులు, ఫుడ్ డెలివరీ బాయ్‌లను పిలిపించాం. నిందితుడిపై సెక్షన్ 354, 366 కింద కేసు నమోదు చేశాం’’ అని తెలిపారు. కంపెనీ ఉద్యోగులను నియమించుకునే ముందు వారి నేపథ్యం తెలుసుకోవాలన్నారు. NOC తప్పనిసరిగా తీసుకోవాలి. నిందితుడు స్థానికుడు కాదు. హైదరాబాద్‌కు చెందిన ఇతను గత ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. హైదరాబాద్‌లో అతని నేరచరిత్రపై ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు.





