
215views
వాషింగ్టన్: ఎలాన్‌మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్ (Starship)’ ప్రయోగం విఫలమైంది. అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్.. కొద్దిసేపటికే పేలిపోయింది. ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి. కానీ, విఫలం కావడంతో పేలిపోయినట్లు ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ పేర్కొంది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని వెల్లడించింది..





