News

ప్లాస్టిక్‌ ఇవ్వండి, బంగారం తీసుకోండి

226views

తమ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు గాను కశ్మీర్‌లోని సదీవారా గ్రామ పంచాయతీ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలోని ప్లాస్టిక్‌ చెత్తను ఇచ్చినవారికి ఒక బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. పథకం ప్రకటించిన 15 రోజుల్లోనే గ్రామం ప్లాస్టిక్‌రహితంగా మారడం విశేషం. ‘‘20 క్వింటాళ్ల పాలిథీన్‌ కవర్లను ఇస్తే బంగారు నాణేన్ని ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు మా ఊరు స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఇతర గ్రామాలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి’’ అని గ్రామ సర్పంచి ఫరూఖ్‌ వివరించారు.