
161views
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వసంతోత్సవ మండపంలో అభిషేకాదులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు.





