ArticlesNews

ఎన్నాళ్ళీ రక్త పిపాస?     

1kviews

స్లామిక్ తీవ్రవాదంతో దేశానికి పొంచివున్న ప్రమాదం గురించి చర్చ వచ్చినప్పుడు తీవ్రవాదానికి మతం లేదంటూ డొల్ల కబుర్లు చెప్పేది వామపక్షీయులే. మనుషులంతా ఒక్కటే అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చేది వారే. రోహింగ్యాల వంటి నరరూప రాక్షసుల హక్కుల కోసం మానవ హక్కుల పోరాటాలు చేసేది వారే. వారి వాదనలకు మద్దతుగా పత్రికల్లో, టీవీల్లో గొంతు చించుకునే వాగుడుకాయల సంగతి సరే సరి. ఇన్ని మాట్లాడి వాళ్ళు చేస్తున్నదేమిటి? దశాబ్దాలుగా అడుగడుగునా అభివృద్దికి అడ్డుపడడం. యావత్ప్రపంచం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను శ్లాఘిస్తుంటే ఇక్కడ మాత్రం అదే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువుపట్టు, ఆధారము అయిన ఎన్నికలను ఈ నకిలీ మానవతా వాదులు రక్త సిక్తం చేస్తున్నారు.

మనుషులంతా ఒక్కటే అనేవారికి చిరుద్యోగులైన జవాన్లు, పోలీసుల ప్రాణాలు ప్రాణాలుగా కనిపించడం లేదా? ఎన్నాళ్ళీ రక్త పిపాస?  వారి వాదనలోని ఈ పరస్పర వైరుధ్యాన్ని వారు ఎలా సమర్దించుకుంటారు? పత్రికల్లో, టీవీల్లో, సినిమాల్లో వామపక్ష తీవ్రవాదులకు మద్దతిస్తూ, వారిని హీరోలుగా చిత్రిస్తూ దశాబ్దాలుగా ప్రజల బుర్రలకు బూజు పట్టించి నిజాలను తెలియనివ్వకుండా చేసిన, చేస్తున్న వారు దీనికి సమాధానం చెబుతారా?  పోయిన, పోతున్న ప్రాణాలకు బాధ్యత వహిస్తారా? అలాంటి తుప్పు పట్టిన సిద్దాంతానికి ప్రచారం కల్పిస్తున్న పత్రికల వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, మేధావులు, సినీ ప్రముఖులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి. నిజాలు గ్రహించాలి. లేదా వామపక్ష తీవ్రవాదులు చేస్తున్న హత్యలకు బాధ్యత వహించాలి. కాదంటే అనతి కాలంలోనే మీ దశాబ్దాల దుర్మార్గపు ప్రవర్తనకి మూల్యం చెల్లించక తప్పదు. జనాగ్రహాన్ని, జనం నుంచి తీవ్ర తిరస్కారాన్ని ఎదుర్కొనక తప్పదు. తస్మాత్ జాగ్రత.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.