News

ప్రభల సంబరం

182views

చీమకుర్తి రామతీర్థం తిరునాళ్లలో భాగంగా చీమకుర్తి పట్టణంలో మంగళవారం రాత్రికి మందిరాల సంబరం జరగనుంది. అందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పట్టణంలో ఆరు విద్యుత్‌ మందిరాల ప్రభలను ఏర్పాటు చేసి సినీ, టీవీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక రామతీర్థం తిరునాళ్ల బుధవారం జరగనుంది. తిరునాళ్లలో 12కుపైగా విద్యుత్‌ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీప్రభల తడికెలను నిధికి తరలిస్తున్నారు. సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో బీవీఎస్‌ఆర్‌ కల్యాణమండపం నుంచి ప్రభను భారీ ఊరేగింపు మధ్య రామతీర్థం తరలించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ఈ ఊరేగింపులో గుర్రం, ఎద్దులబండి ఎక్కి అభిమానులను ఉత్సాహపరిచారు. కంభంపాడులో వైసీపీ రెబల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రభను ఊరేగింపు మధ్య నిధికి తరలించారు.