
173views
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వేల మంది భక్తులు గోవింద నామాలు పలుకుతూ రథాన్ని లాగారు. అనంతరం వసంతోత్సవ మండపంలో స్వామివారికి అర్చకులు వసంతోత్సవ అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. బుధవారంతో వసంతోత్సవాలు పరిసమాప్తమవుతాయి. కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, తితిదే బోర్డు సభ్యుడు మారుతీప్రసాద్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, వీజీవో బాలిరెడ్డి పాల్గొన్నారు.





