News

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా ఆటలకు చెక్ పెట్టిన మోడీ ప్రభుత్వం

957views

శాన్య రాష్ట్రాలను ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించడానికి శాయ శక్తులా యత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. అలాంటిది ఇన్నాళ్ళకు మోడీ ప్రభుత్వం చైనాకు చెక్ పెట్టే దిశగా ముందుకు పోతూ ఉండడం గమనార్హం.

ఈశాన్య రాస్ట్రాల సరిహద్దులలోకి తరచుగా చొచ్చుకు వస్తున్న చైనాను అడ్డుకోవడానికి మోడి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది అస్సాం ను రెండు భాగాలుగా విభజిస్తుంది. మరొక పక్క అరుణాచలప్రదేశ్ ను ఆనుకుని చైనా బోర్డర్ ఉంది. దీనితో ఆయా ప్రాంతాలలొ నేరుగా బలగాలను తరలించడానికి బ్రహ్మపుత్ర నది క్రింద నుండి సొరంగ మార్గం తవ్వాలని మోది ప్రభుత్వం నిర్ణయించింది. బ్రహ్మపుత్ర నది క్రింద ఏకంగా 30 మీటర్ల లోతులొ, 12 నుంచి 15  కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మించనున్నారు. నదికి 30 మీటర్ల లోతులొ నిర్మించడం వలన ఈ వంతెనకు ఏటువంటి శత్రుదేశాల దాడుల భయం ఉండదు. కేవలం ఆర్మీ అవసరాల కోసం నిర్మించే ఈ సొరంగ మార్గాన్ని వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించనున్నారు.