
179views
బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ ఆలయంలో మే 10 నుంచి మల్లికార్జునస్వామి, కామాక్షితాయిల వార్షిక బ్రహ్మోత్సవాల పనులు చేపట్టేందుకు ఆలయంలో అర్చకులు స్తంభ ప్రతిష్ఠ చేశారు. మే 19న కామాక్షితాయి కల్యాణోత్సవంలో తలంబ్రాలు కోసం భక్తులు స్వయంగా వడ్లు వలిచి తలంబ్రాలు తయారుచేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాకార మండపం చుట్టూ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కాగా కామాక్షితాయి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యంనాయుడు, లక్ష్మీకాంతమ్మ దంపతులు 1.570కేజీల వెండి పళ్లాన్ని బహూకరించారు.





