News

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త.. బీఎస్‌ఎఫ్‌లో 10శాతం రిజర్వేషన్లు

283views

అగ్నివీరులకు కేంద్ర శుభవార్త చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్‌ఎఫ్ (BSF) నియామాకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. వీరు అగ్నిపథ్ మొదటి బ్యాచ్‌లో పనిచేశారా లేదా తదుపరి బ్యాచ్‌లకు చెందిన వారా అనే దాని ఆధారంగా గరిష్ట వయోపరిమితి నిబంధనలను కూడా సడలించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డ్యూటీ కేడర్-2015కు సంబంధించిన నిబంధనలను కేంద్ర సవరించింది. అగ్నివీర్ మొదటి బ్యాచ్‌లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు 5 సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌లలో చేరి రిటైర్ అయిన అభ్యర్థులకు 3 సంవత్సవారల వరకూ గరిష్ట వయోపరిమితిని సడలించనున్నారు. మజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ నియామక ప్రక్రియలో దేహడారుఢ్య పరీక్షల నుంచి సైతం మినహాయింపు కల్పించనున్నారు.

కాగా, నాలుగేళ్ల పాటు దేశ సైనికులుగా సేవలందించిన అగ్నివీరులకు సీఏఎస్ఎఫ్, అసోం రైఫిల్స్‌తో పాటు బీఎస్ఎఫ్ నియామకాల్లో వయోపరిమితిని 3, 5 సంవత్సరాలకు పెంచడం, దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం వల్ల ఉద్యోగార్ధులకు కొంత మేరకు మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం తొలి బ్యాచ్‌లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వరకూ అగ్నివీర్‌గా సేవలందించి, ఆపై కేంద్ర భద్రతా దళాలు, అసోం రైఫిల్స్‌లో చేరేందుకు 10 శాతం రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తుంది.