News

వైభవంగా పెద్దింటమ్మ కల్యాణం

209views

కైకలూరు కొల్లేటికోట పెద్దింటి అమ్మ గా పిలువబడే జలదుర్గా దేవి గోకర్ణపురం శ్రీ గోకర్ణేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ, ఐలూరి వెంకట్రావు ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలతో మూడేళ్లుగా అల్లాడిన ప్రజలు స్వేచ్ఛగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున తరలిరావడం తో ఆలయప్రాంగణం కిక్కిరిసింది. ముందుగా శృంగ వరప్పాడు, గుమ్మళ్ళపాడు, పందిరిపల్లిగూడెం గ్రామాల నుంచి కలువ బోనాలను, పందిరిపల్లి గూడెం నుంచి భారీ ప్రభకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంక టరమణ దంపతులు పూజలు చేసి ప్రారంభిం చారు. వేలాది మంది మహిళలు కలువబోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మ వారి ఆల యానికి చేరుకున్నారు. ప్రభ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పెద్దింట్లమ్మ నామస్మరణలతో ఆలయానికి తీసుకువచ్చారు. కొల్లేరు గ్రామాల్లో ఎటుచూసినా భక్తులతో రహదారులు కిటకిటలాడా యి. ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంభ్రాలు అమ్మవారికి సమర్పించారు. టీడీపీ నేత లు పెన్మెత్స త్రినాధరాజు, బొమ్మనబోయిన విజయ లక్ష్మి, పోలవరపు లక్ష్మీరాణి తదితరులు ప్రభకు పూజలు చేసి అమ్మ వారిని దర్శించుకున్నారు. కోలా ట ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు, గరగనృత్యా లు, శక్తి వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.