News

ఉపమాక వేంకటేశ్వరుడు స్వర్ణాలంకరణలో భక్తులకు దర్శనం

201views

విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని ఉపమాక వేంకటేశ్వరుడు స్వర్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఉభయదేవేరులతో పసిడికాంతులతో విరాజిల్లుతున్న వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొండపై వున్న స్వామి నిజరూపాన్ని, కింద ఆలయంలో వున్న ఉభయదేవేరులతో కూడిన స్వామివారు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.