News

అగ్నివీర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. నియామక ప్రక్రియలో కీలక మార్పులు

268views

గతేడాది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన.. ‘అగ్నిపథ్‌’ పథకంలో భాగంగా.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ‘అగ్నివీర్‌’ పేరిట నియామకాలు చేపడుతున్నారు. గతేడాది తొలిసారిగా అగ్నివీర్‌ల నియామకం జరిగింది! తాజాగా.. 2023–24 సంవత్సరానికి సంబంధించి.. ఆర్మీ విభాగంలో.. అగ్నివీర్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది! మరోవైపు నియామక ప్రక్రియలో కీలక మార్పులు ప్రకటించారు!! ఈ నేపథ్యంలో.. ‘అగ్నివీర్‌’ నియామక ప్రక్రియలో తాజా మార్పులు, రిక్రూట్‌మెంట్‌ విధానం, విధులు, ప్రయోజనాలు తదితర అంశాలపై విశ్లేషణ..

గత ఏడాది నుంచే అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ నియామకాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆర్మీ విభాగంలో.. 2023–24 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న 72 ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ల పరిధిలో.. అన్ని రాష్ట్రాల్లోనూ పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ అర్హతలతో అగ్నివీర్‌ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్, విశాఖపట్నం, గుంటూరు రిక్రూటింగ్‌ ఆఫీస్‌ల పరిధిలో అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎంపిక ప్రక్రియలో మార్పులు
అగ్నివీర్‌ నియామక విధానంలో ఈ ఏడాది కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో ఫేజ్‌–1,ఫేజ్‌–2లుగా ఎంపిక ప్రక్రియను పేర్కొన్నారు. ముందుగా ఫేజ్‌–1లో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.ఆ టెస్ట్‌లో సాధించిన మార్కులు, పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి నిర్దిష్ట కటాఫ్‌ను పేర్కొని మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశ ఫేజ్‌- 2లో.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్,ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను నిర్వహిస్తారు. ఫేజ్‌–2 దశలోనూ ప్రతిభ చూపి..తుది విజేతలుగా నిలిస్తే అగ్నివీర్‌లుగా నియామకం ఖరారు చేస్తారు.వాస్తవానికి గత ఏడాది ముందుగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ పేరుతో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి.. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి తదుపరి దశలో రాత పరీక్ష నిర్వహించి నియామకాలు ఖరారు చేశారు.
ఈ పోస్ట్‌లకే నియామకాలు
అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా 2023–24 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో.. అగ్నివీర్‌(జనరల్‌ డ్యూటీ–ఆల్‌ ఆర్మ్స్‌), అగ్నివీర్‌(టెక్నికల్‌–ఆర్మ్స్‌), అగ్నివీర్‌ క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌(ఆల్‌ ఆర్మ్స్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌(ఆల్‌ ఆర్మ్స్‌), ట్రేడ్స్‌మెన్‌(ఆల్‌ ఆర్మ్స్‌– ఎనిమిదో తరగతి) పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍