
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసివున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి వారు బ్రహ్మో త్సవాలలో భాగంగా మూడో మంగళవారం రాత్రి హనుమంతవాహనంపై గ్రామోత్సవంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే స్వామి వారు ప్రథమంగా హనుమంతుని వాహనం ఎంచుకున్నారనేది భక్తుల నమ్మకం. హనుమ అంటే బుద్ధి, బుద్ధి ప్రదాత. అభ యప్రదాత అయిన హనుమంతుని భుజస్కంధాలపై లక్ష్మీ నారసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన భక్తులకు స్వామివారు సద్బుద్ధిని, అభయాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ ఈఓ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కైంకర్యపరులుగా వ్యవహరించారు. భక్తులు పెద్దసంఖ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రవచనం, అన్నమాచార్య కీర్తనలు, కూచిపూడి నృత్యాలు, మిమిక్రీలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేడు రాజాధిరాజ వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 7 గం. టలకు రాజాధిరాజ వాహనంపై లక్ష్మీనృసిం హస్వామి గ్రామోత్సవంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. భక్తులంతా ఉత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.





