
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రవాది సర్ఫరాజ్ మెమోన్ భారత్‌లోకి అడుపెట్టినట్లు ముంబయి పోలీసులకు తెలిపింది. దీంతో
ముంబయి పోలీసులు అలెర్టు అయ్యారు. డేంజరస్ మేన్ ముంబయిలోకి అడుగు పెట్టాడని, జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఐఏ హెచ్చరించింది. ఈ మేరకు మెయిల్ చేసింది. “Dangerous” అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరీ మెయిల్ పంపింది. ఆ వ్యక్తి సర్ఫరాజ్ మెమోన్‌గా అనుమానిస్తోంది. ఇప్పటికే సర్ఫరాజ్ ముంబయికి వచ్చాడని తెలిపింది. ఇండోర్‌కు చెందిన ఈ వ్యక్తి చైనా, పాకిస్థాన్, హాంగ్‌కాంగ్‌లో ట్రైన్ అయినట్టు స్పష్టం చేసింది. భారత్‌పై కుట్ర చేస్తున్నాడని, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వివరించింది. పేరు, ఊరుతో సహా… ఆ వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలనూ మెయిల్‌లో పంపింది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఎల్‌సీ కాపీలను ముంబయి పోలీసులకు అందజేసింది. ముంబయి పోలీసులు ఇండోర్ పోలీసులకు ఈ సమాచారం అందించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వెపన్స్ ట్రైనింగ్ కోసం పాకిస్థాన్ వెళ్తున్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఖలీద్ ముబారక్ ఖాన్, తమిళనాడుకు చెందిన అబ్దుల్లాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ అక్రమంగా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెండు తుపాకులు, 10 క్యాట్‌రిడ్జ్‌లు, కత్తి, వైర్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.





