
202views
కశ్మీర్‌లో ఉగ్రవాదులు వాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు సృష్టించిన మారణకాండకు మరో పండిట్ బలయ్యారు. ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 40 ఏళ్ల పండిట్ సంజయ్ శర్మ బలయ్యారు. అచన్ పుల్వామాకు చెందిన సంజయ్ ఓ బ్యాంకులో ఏటీఎం గార్డుగా పనిచేస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. సంజయ్‌శర్మ హత్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు సిన్హా పేర్కొన్నారు.





