
శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను వైభవంగా నిర్వహించారు. పూజాకార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతికి పూజలు చేశారు. తరువాత స్వామిఅమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. అమ్మవారికి అషోత్తరం త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్ర నామార్చన పూజలు నిర్వహించి మంగళ హారతులను సమర్పించారు.
గ్రామ దేవత అంకాలమ్మకు విశేష పూజలు..
శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యానాన్ని ఆకాం క్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. ఈ పూజలలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.





