
201views
తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో రెండేళ్ల కిందట ఇక్కడ గోశాలను స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ గోశాలకు దేవుడికి దానంగా ఇచ్చిన గోవులను తీసుకువచ్చి పెంచుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గోశాలలో అరుదైన గో సంతతికి చెందిన పుంగనూరు జాతికి చెందిన గోవులు వుండటం విశేషం. ఇటీవల ఈ జాతికి చెందిన గోవు జన్మనివ్వగా ఆ గోమాతకు గ్రామస్తులు కేశవుడు అని నామకరణం చేసి డోలారోహణ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.





