News

ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం

230views

ఢిల్లీలోని బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాలు వాణిజ్య వినియోగానికి వాడరాదన్న భారత మోటారు వాహన చట్టాన్ని అనుసరించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సర్కారు తెలిపింది. ఆదేశాలు ఉల్లంఘించిన వారికి రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉబెర్‌, ఓలా, రాపిడో వంటి సంస్థలకు ఇవి వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేలాదిమంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.