News

”ముస్లిం విద్యార్థులు గడ్డాలు తీయవద్దని ఆదేశం.. లేదంటే డిస్మిస్‌ చేస్తాం”

Muslim man reading koran in mosque
243views

ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ జారీ చేసిన తాజా ఆదేశాల్లో ముస్లిం విద్యార్థులు తమ గెడ్డాలను కత్తిరించుకోరాదని, పూర్తిగా తీయకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ధిక్కరించినవారిని తమ సంస్థ నుంచి బహిష్కిస్తామని తెలిపింది. మౌలానా హుస్సేన్ అహ్మద్ హరిద్వారి ఈ ఆదేశాలను జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

గెడ్డాన్ని ట్రిమ్ లేదా షేవ్ చేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకమని ఈ ఆదేశాల్లో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించాలని, లేదంటే, బహిష్కరణకు సిద్ధపడాలని హెచ్చరించారు. వచ్చే సెమిస్టర్‌లో గెడ్డం లేకుండా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఎవరైనా విద్యార్థి ప్రయత్నిస్తే, అనుమతించబోమని తెలిపారు. ఇస్లామిక్ స్టడీస్ విద్యార్థులు ఇటువంటి అవిధేయతను ప్రదర్శిస్తే సహించబోమని తెలిపారు.

గెడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న నలుగురు విద్యార్థులను ఈ నెల 6న డిస్మిస్ చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఆ నలుగురు విద్యార్థులు క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. అయితే గతంలో విద్యార్థులు చదువుకునే చోట మతాల ప్రస్థావన ఉండకూడదని పలుమార్టు కోర్టులు చెప్పాయి.. అయినప్పటికీ వాటిని దిక్కరిస్తూ.. ఇటువంటి ఆదేశాలు జారీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.