News

మహాశివరాత్రి ఉత్సవాలకు గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు

273views

మహాశివరాత్రి ఉత్సవాలకు బాపట్ల జిల్లా పరిధిలోని గోవాడ శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో అశోక్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతాయి. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ విద్యుత్‌ ప్రభను శుక్రవారం సాయంత్రం ప్రారంభించనున్నట్లు ఈవో తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. గురువారం గోవాడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా 500మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. తొలుత శ్రీబాలకోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్‌ చేకూరి లక్ష్మయ్యచౌదరి, ఈవో అశోక్‌రెడ్డి స్వాగతం పలికారు. ఎస్పీ వెంట రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ, చుండూరు, వేమూరు, సీఐలు కల్యాణ్‌రాజ్‌, వెంకటేశ్వరరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఆళ్ళ హరి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు అనిల్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, కొండారెడ్డి, వై.సురేష్‌, తదితరులు ఉన్నారు.