News

భక్తిశ్రద్ధలతో గజగౌరీ వ్రతాలు

396views

అనంతపురం నగరంలోని పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ నెల 7న గజగౌరీ వ్రతాన్ని ఆచరించారు. ఆలయం, కల్యాణ మండపం ఆవరణలో వందలాది మంది మహిళలు ఏకకాలంలో గజగౌరీ వ్రతంలో పాల్గొన్నారు. అమ్మవారిని ఫల, పుష్పాలతో పూజించి, 11 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించారు. వేద పండితులు గజగౌరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు వ్రత విశిష్టతను వివరించారు. మహా మంగళహారతి నివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో అన్నదానం చేశారు.