News

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన

340views

అద్దంకిలోని శింగరకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచై తన్య అన్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రూ.1.59 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూ.65.50 లక్షలతో మారుతీ భవన్‌ ఆధునికీకరణ, రూ.45 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, రూ.34 లక్షలతో మాఢవీధులు, రూ.15 లక్షలతో కార్యాలయం భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కృష్ణచైతన్య శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో సుభద్ర, కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, సర్పంచి ఎర్రిబోయిన తిరుపతయ్య, జమ్మలమడక రమాదేవి హనుమంతరావు, రాఘవరెడ్డి, బాలు, గుంజి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.